Kubera: ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కుబేర’. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహనరావు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా టీజర్ ను 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు దీపావళి సందర్భంగా పోస్టర్ ద్వారా తెలియచేసింది యూనిట్. సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ పాట చిత్రీకరణ మిగిలిఉంది. జిమ్ సరబ్, దిలీప్ తాహిల్, కౌశిక్ మహతా, దివ్య దేకాటే, సౌరవ్ ఖురానా ఇందులోని ఇతర ముఖ్య పాత్రధారులు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan-Trivikram: పవన్–త్రివిక్రమ్ కాంబో రిపీట్?