KTR: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గిరిజన మహిళలపై జరిగిన దాడిని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అమానుషమని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “ముఖ్యమంత్రిగా అలాంటి వ్యక్తి ఉంటే, రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఎలా అమలవుతుంది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Also Read: Sonia Gandhi: భారత్ మౌనంగా ఉండటం విషాదకరం
KTR: దేశ నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. “ఇదేనా దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రాహుల్ గాంధీ ఇచ్చే హామీ? దేశంలోని మహిళలు ప్రియాంకా గాంధీ నుండి ఆశించే గౌరవం ఇదేనా? మల్లిఖార్జున ఖర్గే పదే పదే ప్రస్తావించే సమానత్వం ఇదేనా?” అని కేటీఆర్ నిలదీశారు.
ఈ ఘటనపై తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు.