PM Suraksha Bima Yojana: ఇప్పటి రోజుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయ్యే సమయంలో అందరి దగ్గర పెద్ద మొత్తంలో పొదుపులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో బీమా రక్షణ మాత్రమే మనకు భరోసా ఇస్తుంది. చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణను అందించే అద్భుతమైన పథకం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY).
ఈ పథకం ద్వారా కేవలం ₹20 ప్రీమియం చెల్లిస్తే, మీరు లేదా మీ కుటుంబానికి ₹2 లక్షల ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ఎవరు ఈ పథకానికి అర్హులు?
-
వయస్సు: 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులెవరైనా ఈ పథకంలో చేరవచ్చు.
-
బ్యాంకు ఖాతా: తప్పనిసరిగా ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో పొదుపు ఖాతా ఉండాలి.
-
ప్రీమియం: సంవత్సరానికి ఒక్కసారి కేవలం ₹20 చెల్లించాలి.
-
రిన్యూవల్: ప్రతి సంవత్సరం బీమాను పునరుద్ధరించుకోవాలి.
ఎంత బీమా రక్షణ లభిస్తుంది?
పరిస్థితి | బీమా రక్షణ మొత్తం |
---|---|
ప్రమాదంలో మరణం | ₹2 లక్షలు |
పూర్తి అంగవైకల్యం (రెండు కాళ్లు/చేతులు/కళ్లు పోగొట్టుకోవడం) | ₹2 లక్షలు |
పాక్షిక వైకల్యం (ఒక చేయి/కాలు/కన్ను పోగొట్టుకోవడం) | ₹1 లక్ష |
సహజ మరణం లేదా అనారోగ్యంతో మరణం | బీమా వర్తించదు |
1. ఆఫ్‌లైన్ దరఖాస్తు
-
మీ బ్యాంకు శాఖలో వెళ్లి ఫారమ్ తీసుకోవాలి.
-
అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా పూరించాలి.
-
అవసరమైన పత్రాలతో పాటు సమర్పించాలి.
2. ఆన్‌లైన్ దరఖాస్తు
-
అధికారిక వెబ్‌సైట్ jansuraksha.gov.in ఓపెన్ చేయండి.
-
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-
అప్లికేషన్ ఫారమ్‌ను భర్తీ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
ఎందుకు ఈ బీమా అవసరం?
రోజుకు రెండు టీ కప్పులు లేదా ఒక సిగరెట్ ఖర్చు మానేస్తే మీరు ఈ బీమా తీసుకోవచ్చు. ఇంత తక్కువ ప్రీమియంతో ప్రమాదాల సమయంలో మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే అద్భుతమైన పథకం ఇది.