Dilruba

Dilruba: వెనక్కి తగ్గిన కిరణ్ అబ్బవరం.. దిల్ రూబా వాయిదా!

Dilruba: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది.

Also Read: Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేస్తారు.. కానీ ఈ మహిళా కొత్తగా వర్క్ ఫ్రమ్

ఈ సినిమాను మొదట ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.అయితే, ఈ సినిమాను ఇప్పుడు మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి క తో కంబ్యాక్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Ka Mass Jathara – Full Video Song

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *