Viral News: ఇపుడు ఉన్న సొసైటీలో అందరూ ముల్టీటాస్కింగ్ చేస్తున్నారు. కానీ అలాచేయడానికి ఒక్కప్లేస్ ఇంకా సమయం ఉంటుంది కానీ బెంగళూరులో ఒక మహిళ తాను ఉన్న ప్లేస్ ఇంకా సమయం మర్చిపోయి నిర్లక్షాని ప్రదర్శించింది. ఆ మహిళ డ్రైవింగ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా, మరో డ్రైవర్ దానిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు ఈ విషయంలో చర్య తీసుకొని ఆ మహిళకు రూ. 1000 జరిమానా విధించారు.
ఆ మహిళ కారు నడుపుతున్నప్పుడు ల్యాప్‌టాప్ వాడుతుండగా, ఆ దారిన వెళ్తున్న ఒక వ్యక్తి ఆ మహిళను చూసి ఆమె కారు నంబర్ ప్లేట్‌ను వీడియో తీశాడు. వీడియో వైరల్ కావడంతో, పోలీసులు ఆ మహిళను గుర్తించి ఆమెకు నోటీసు జారీ చేశారు.
విచారణ సమయంలో, పని కోసం లాగిన్ అవ్వడం అవసరమని ఆ మహిళ స్పష్టం చేసింది. ఆమె బిటిఎం లేఅవుట్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని, ఆర్‌టి నగర్‌లోని తన ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పింది. లాగిన్ సమయం అవడంతో అదే సమయంలో ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో, ఆమె ల్యాప్‌టాప్‌ను ను వాడుకొని లాగిన్ అయ్యాను అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Lucknow: పెళ్లిలో అనుకోని అతిథి.. దెబ్బకు అక్కడంతా పరుగో పరుగు!
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిరిగౌరి డిఆర్ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో “డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాదు, ఇంటి నుండే పని చేయండి” అని పోస్ట్ చేశారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ వాడకూడదని పోలీసులు ఆ మహిళను హెచ్చరించారు, ఎందుకంటే అది ఆమెకు మాత్రమే కాకుండా ఆమె వర్క్ చేస్తూ కార్ నడపడం వల్ల ఇతరులకి కూడా ప్రమాదం అని చెప్పారు..అలాగే, ఆ మహిళకు రూ.1,000 జరిమానా విధించి, రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు.
సోషల్ మీడియాలో చెలరేగిన చర్చ
ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చాలా మంది ఆ మహిళ నిర్లక్ష్యాన్ని విమర్శించారు, మరికొందరు ఆమె యజమాని కూడా దీనికి బాధ్యత వహించాలా అని ప్రశ్న లేవనెత్తారు. “ఈ సంఘటన ఉద్యోగ మహిళలపై పని ఒత్తిడిని చూపిస్తుంది, కానీ డ్రైవింగ్ చేస్తూ పని చేయడం పెద్ద తప్పు” అని ఒక వినియోగదారు అన్నారు.
అదే సమయంలో, కొంతమంది మహిళలు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి నుండి పని చేసే అవకాశం (WFH) ఇవ్వాలని సూచించారు, తద్వారా వారు అలాంటి పరిస్థితులను నివారించవచ్చు. “ఇది ఆ మహిళ తప్పు మాత్రమే కాదు, ఆమెను అంత రిస్క్ తీసుకోవడానికి బలవంతం చేసిన వ్యక్తి కూడా తప్పు” అని మరొక యూజర్ రాశారు.
“work from home not from car while driving” pic.twitter.com/QhTDoaw83R
— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025