coolie

coolie: ‘కూలీ’ రైట్స్ రేసులో కింగ్?

coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కూలీ’ షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాతో రజనీ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున సైమన్ అనే కీలక పాత్రలో నటిస్తూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

అంతేకాదు, నాగార్జున ఈ సినిమా తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే తెలుగు రైట్స్ డీల్ ఖరారయ్యే అవకాశం ఉంది.అయితే, ఈ సినిమా రైట్స్ కోసం ఇప్పటికే నాగవంశీ, దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ కూడా తీవ్రంగా పోటీపడుతున్నారు.

Also Read: Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్‌ 1’ రిలీజ్‌పై స్పష్టత.. సోషల్‌ మీడియా రూమర్స్‌కు చిత్రబృందం చెక్!

coolie: రైట్స్ ఎవరి సొంతమవుతాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ చిత్రంలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ghaati: అనుష్క ఘాటి మూవీలో కోలీవుడ్ హీరో.. గ్లింప్స్ రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *