Kambala Buffalo Race: కర్ణాటకలోని మంగళూరులో జరిగిన సాంప్రదాయ క్రీడ కంబాల రేసింగ్‌లో 160 జతల గేదెలు పాల్గొని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. వరి పొలాలను దున్నడానికి గేదెలను ఉపయోగిస్తారు. అక్కడ ప్రతి ఏటా గేదెలతో పరుగు పందెం పోటీ పెడతారు. కంబాల రేసింగ్ గా ఇది ప్రసిద్ధి పొందింది.
కంపాలా గేదెల పందెం 100 సంవత్సరాలకు పైగా ఒక సంప్రదాయంగా ఉంది. దీనిలో భాగంగా, మంగళూరు నగరంలోని నేత్రావతి నది ఒడ్డున 15వ సంవత్సరం కంపాలా రేస్ జరిగింది. ‘జయ విజయ జోడుగరే కంబాల’ అని పిలువబడే ఈ పరుగు పందెం ఫిబ్రవరి 8-9 తేదీలలో జరిగింది.
Also Read: AAP Defeat: యమునా నది శాపమే ఆప్ ఓటమికి కారణం
బురదమయమైన మట్టి రోడ్డుపై, ఆటగాళ్ళు ఒక్కొక్కరు రెండు గేదెలను పట్టుకుని పరుగులు తీస్తూ పందెం వేశారు. ఇందులో మొత్తం 160 జతల గేదెలు పాల్గొన్నాయి. తమ వెనుక ట్రైనర్ పరుగులు పెట్టిస్తుంటే.. గేదెలు ఉగ్రంగా పరుగెత్తుకుంటూ, వేలాది మంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. చూడటానికి చాలా బీభత్సంగా ఈ పోటీ కనిపిస్తుంది. రెండు గేదెలను పరుగులు పెట్టిస్తూ వెనుక పరిగెత్తే ట్రైనర్ ని చూస్తే వీడిది గుండెనా అనిపిస్తుంది. అత్యంత సాహసంగా గేదెలను బురద రోడ్డుపై పరిగెత్తించడం అంటే సామాన్యమైన విషయం కాదు.