America: అమెరికాలోని అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌పై దాడికి, అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చేందుకు యత్నించిన కేసులో తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ అక్కడి న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. 2023లో జరిగిన ఈ ఘటనపై ఇన్నాళ్లుగా విచారణ కొనసాగింది. ఈ విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో జైలు శిక్షను ఖారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
America: 2023 మే 22న సాయంత్రం మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి తెలుగు సంతతి వ్యక్తి అయిన 19 ఏండ్ల వయసున్న కందుల సాయి వర్షిత్ చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో అదేరోజు రాత్రి 9.55 గంటల సమయంలో వైట్ హౌస్ వద్దకు వెళ్లి సైడ్ వాక్‌పై ఈ ట్రక్కును నడిపాడు. దీంతో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురై వారంతా పరుగులు పెట్టారు. వెంటనే తన వాహనాన్ని వైట్‌హౌస్ భవనం వైపు నడుపుతూ అక్కడ భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను బలంగా రెండుసార్లు ఢీకొట్టాడు.
America: ఆ వెంటనే ట్రక్కు నుంచి కిందికి దిగా నాజీ జెండాను చేతిలో పట్టుకొని నినాదాలు చేయసాగాడు. ఈ సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్‌ను హతమార్చి, రిపబ్లికన్ పార్టీని దించడమే తన లక్ష్యం.. అని నినాదాలు చేశాడు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనికోసం నిందితుడు సాయివర్షిత్ ఆరు నెలలకు ముందు నుంచే ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై ఇంతకాలం విచారించిన కోర్టు తాజాగా అతడి శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. నిందితుడైన కందుల సాయి వర్షిత్‌కు 8 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి డాబ్నీ ఫ్రెడ్రిచ్ తీర్పు చెప్పారు.