Janaki VS State Of Kerala: ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించడంతో ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు అబ్జెక్షన్ చేసిన సెన్సార్ బోర్డ్, ఇప్పుడు వెనక్కి తగ్గింది.. ముందు చెప్పినట్టు 96 కట్స్ ఏం వద్దని, కేవలం రెండే మార్పులు చేస్తే చాలు అని చెప్పింది. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే పేరుని ‘వి.జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ లేదా ‘జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా మార్చమని సెన్సార్ బోర్డు హైకోర్టుకి తెలిపింది. సినిమాలోని ఓ కోర్టు సీన్ లో హీరోయిన్ పేరుని మ్యూట్ చేయమని కూడా కోరింది. అలా చేయకపోతే ఇదే తరహా సన్నివేశాలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, దాని వల్ల కొన్ని వర్గాల వారి మనోభావాల టాపిక్ వస్తుందని సెన్సార్ బోర్డు వాదనల్లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం మూవీ టీంని అభిప్రాయం అడగ్గా.. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది కాబట్టి.. ఆ మార్పులకు మూవీ టీం ఓకే చెప్పొచ్చని తెలుస్తోంది.
