IT Raids: బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంటిపై గురువారం (జూలై 24) ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్టు సమాచారం.
IT Raids: వచ్చిన ఆదాయం, పన్ను చెల్లింపు విషయంలో వచ్చిన హెచ్చుతగ్గులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు మల్లారెడ్డి ఇంటితోపాటు ఆయన కుటుంబ సభ్యులైన ఆయన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐటీ అధికారుల తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.