Kamal Haasan: కమల్ హాసన్ నటిస్తున్న KH237 చిత్రం గురించి తాజా అప్‌డేట్స్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి. స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ Anbumani and Arivumani డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో లేదా మధ్యలో జరిగే అవకాశం ఉంది. హీరోయిన్‌గా యువ నటి కళ్యాణి ప్రియదర్శన్ ఎంపికైనట్లు సమాచారం. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస స్వీకరించారు. కమల్ హాసన్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారని, కథాంశం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో కమల్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
