Ram Charan: ఆస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆయనను తప్పించి దేవిశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నిజానికి ఈ సినిమా కోసం రెహమాన్ ను పట్టుబట్టి మరీ ఒప్పించారు. సినిమా ఓపెనింగ్ లో కూడా రెహమాన్ పాల్గొన్నారు. అయితే వ్యక్తిగతమైన కారణాలతో రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దాంతో తనకు ‘ఉప్పెన’ చిత్రానికి చార్ట్ బస్టర్స్ అందించిన దేవీశ్రీని రంగంలోకి దించాడట బుచ్చిబాబు. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనపించనున్నాడు.
