Arjun Boini: ఎలో రేటింగ్‌లో 2800 మార్క్ అందుకున్న తర్వాత అర్జున్ స్వదేశంలో ఆడుతున్న తొలి టోర్నీ… చెన్నై చెస్ గ్రాండ్‌మాస్టర్స్ లో తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేశి శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో విదిత్ గుజరాతిపై విజయం సాధించాడు. ఛాలెంజర్స్ విభాగంలో ప్రణవ్ చేతిలో ద్రోణవల్లి హారిక పరాజయం పాలవగా.. మహిళల గ్రాండ్‌ప్రి చెస్ రెండో అంచె టోర్నమెంట్లో కోనేరు హంపికి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఆరో రౌండ్లో ఈ భారత గ్రాండ్‌మాస్టర్ 41 ఎత్తుల్లో గ్రీస్ కు చెందిన స్ట్రావ్‌రౌలా చేతిలో ఓడింది. మరోవైపు దివ్య దేశ్‌ముఖ్ డ్రా చేసుకుంది. ఆరు రౌండ్ల తర్వాత 3 పాయింట్లతో హంపి అయిదో స్థానంలో ఉండగా.. అన్నే పాయింట్లు సాధించిన దివ్య ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో 5 పాయింట్లతో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచికినా తొలి స్థానంలో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Team India: టీం ఇండియాలో ది బెస్ట్ ఎవరంటే.. ?

