Mahaa News: రైస్ మాఫియా, కాకినాడ సీపోర్టులో అక్రమాలపై మహా న్యూస్ మహా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. సీపోర్టులో అక్రమాలపై.. దాని వెనుకున్న గత ప్రభుత్వ పెద్దల సహకారంపై మహా కథనాలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పుడు ఈ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీపోర్టులో జరిగిన అక్రమాలపై ఏమి జరిగిందనే విషయాన్ని బయటకు తీయడానికి ఈడీ రంగంలోకి దిగింది. సీపోర్టును బలవంతంగా అరబిందోకు కట్టబెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ హయాంలో చోటు చేసుకున్న డీల్ వెనుక ఉన్న వారిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది ఈడీ. విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, అరబిందో సంస్థలను ఈ నిందితులుగా పేర్కొంది. ఇందులో ఏ1 గా వై.విక్రాంత్ రెడ్డి (వైవీ సుబ్బారెడ్డి కుమారుడు)ని పేర్కొంది. ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Vietnam: కేఫ్ యాజమాన్యంతో గొడవ.. పెట్రోల్ పోసి 11 మందిని చంపిన కస్టమర్..
Mahaa News: సీపోర్టు డీల్ లో మనీలాండరింగ్ జరిగినట్టు పాథమికంగా ఈడీ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం కోడం విక్రాంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని అంటున్నారు. కాకినాడ సీపోర్టును కేవీ రావు నుంచి కైవసం చేసుకోవడానికి తాడేపల్లి పెద్దలు గట్టి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా తమకు బాగా దగ్గర కంపెనీ అయిన అరబిందోకు 41 శాతం వాటాలను కట్టబెట్టడానికి కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించారని కేవీ రావు ఆరోపించారు. ఈమేరకు ఆయన సీఐడీకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ మొత్తం వ్యహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది. దీనికోసం మనీ ల్యాండరింగ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈడీ ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే, అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పి.. దోపిడీలో జగన్ కు సహకరించిన నాయకుల కథలు బయటపడే ఛాన్స్ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.