Hyderabad: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు.
సాధారణ ప్రజలాగే ఎలాంటి ప్రత్యేక ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా వెళ్లి, అక్కడ జరుగుతున్న నిమజ్జన ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సాదాసీదా తరహాలో సీఎం రావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.