Hyderabad: తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో ప్రవేశపెట్టిన ‘స్పెషల్ ఎక్సైజ్ సెస్’ను మళ్లీ పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రకాల మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి.
ఎక్సైజ్ శాఖ తాజాగా మద్యం షాపులకు అధికారికంగా సర్క్యూలర్లు పంపింది. ఇందులో కొత్త ధరలు, వాటిపై విధించే సెస్ వివరాలను పొందుపరచినట్లు తెలుస్తోంది. ఇది తాగుబోతులపై మరింత భారం కలిగించే అవకాశం ఉంది.
పాత సెస్ విధానాన్ని తిరిగి తీసుకురావడం వలన ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, సామాన్య వినియోగదారులపై దీనివల్ల ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ఉత్పత్తుల ధరలు, పెట్రోల్–డీజిల్ రేట్లు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టగా, మద్యం ధరల పెంపు నిర్ణయం పలు వర్గాల్లో విమర్శలకు దారితీస్తోంది.