Hyderabad News: హైదరాబాద్ నగరంలో భూ వివాదాలు ఒకటి, రెండు కాదు.. వేలాది భూ సమస్యలతో ఎందరో వేదనకు గురవుతున్నారు. మరెందరో నష్టాల పాలవుతున్నారు. ఇంకా కొందరు ఆ భూ సమస్యలకే బలవుతున్నారు. ఇలాంటి భూ సమస్యతో ఓ పారిశుధ్య కార్మికురాలు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే ఫిర్యాదు చేసింది. అదీ ఓ ఎమ్మెల్యే అనుచరులు తన భూమి విషయంలో వేధిస్తున్నారని, తనను చంపేందుకు యత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది.
Hyderabad News: హైదరాబాద్ నగర పరిధిలో పారిశుధ్య కార్మికురాలిగా నారాయణమ్మ పనిచేస్తున్నది. ఆమె మే 3న ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు తన భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించింది.
Hyderabad News: గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఫిలింనగర్ వినాయక్ నగర్‌లో 120 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పారిశుధ్య కార్మికురాలి నారాయణమ్మ తెలిపారు. ఆ స్థలంలో అప్పటి నుంచి తాను నివాసం ఉంటున్నానని తెలిపారు. తనను అకారణంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు ఖాళీ చేయించి, తన స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు.
Hyderabad News: తన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను కలిసినా ఫలితం దక్కలేదని నారాయణమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. న్యాయం కోసం తిరుగుతున్న తనపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేస్తూ, తనపైనే కేసులు పెట్టిస్తన్నారని, ఏకంగా తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించింది.
Hyderabad News: ఫిలింనగర్ బస్తీలలో స్థలాల పంపిణీల పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని నారాయణమ్మ కోరారు. తన భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై దాడులకు పాల్పడుతున్న, చంపేందుకు యత్నిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.