WTC 2025: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు మరింత రసవత్తరంగా మారింది. టాప్-2లో నిలిచి ఫైనల్‌లో ఆడటం కోసం భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ప్రస్తుతం టీమ్ఇండియా 61.11 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది. మరి టీమిండియా ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి..? అది తెలియాలంటే ఈస్టోరీ చూడాల్సిందే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ రేసు మ్యాచ్‌లు ముగుస్తున్నకొద్దీ రసవత్తరంగా మారుతోంది. స్వదేశంలో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 233 తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా 59.26 విజయాల శాతంతో రెండో స్థానానికి దూసుకొచ్చింది. దీంతో ఆస్ట్రేలియా 57.69 విజయాల శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ 50.00, శ్రీలంక 50.00 తర్వాత స్థానాల్లో ఉండగా పెర్త్ టెస్టులో ఘన విజయంతో టీమిండియా తొలి స్థానంలో కొనసాగుతోంది. కాగా, మరోవైపు మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై.. ఇంగ్లండ్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణాలు మారాయి.
ఇది కూడా చదవండి: PV Sindhu Marriage: పెళ్లి పీటలెక్కబోతున్న పీవీ సింధు
WTC 2025: ప్రస్తుతం టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సమీకరణాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ని భారత్ 5-0, 4-1, 4-0, 3-0తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ జట్టు అర్హత సాధిస్తుంది. పైన పేర్కొన్న సమీకరణాల ప్రకారం భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంటే ఆస్ట్రేలియా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
విజయాల శాతంలో పెద్దగా తేడా లేక పోవడంతో ఒక్క ఓటమితో జట్ల అవకాశాలు గల్లంతు కానున్నాయి. మనం గెలిస్తే ఆస్ట్రేలియా ఔట్ లేదంటే మనమే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ని 3-1తో కైవసం చేసుకున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. కానీ, సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
ఇది కూడా చదవండి: PV Sindhu: సింధు ఎట్టకేలకు
WTC 2025: ఒకవేళ సౌతాఫ్రికా, శ్రీలంకల మధ్య రెండో మ్యాచ్ డ్రా అయినా కూడా ఆసీస్‌పై భారత్ 3-1తో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-2తో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లే అర్హత సాధిస్తుంది. కానీ, ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక కచ్చితంగా ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంటేనే భారత్ ఫైనల్‌కు చేరుతుంది. ఈ సిరీస్ జనవరి 29 నుంచి శ్రీలంక వేదికగా మొదలవనుంది. అంతేకాకుండా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడానికి అవకాశాలుంటాయి. కానీ, ఇలా జరగాలంటే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకోవాలి. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక జట్టు కనీసం 1-0తో చేజిక్కించుకోవాలి. అప్పుడే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-2తో డ్రా చేసుకున్నా ఫైనల్‌కు చేరుతుంది.