HIV Injection: ఉత్తరప్రదేశ్‌లో కట్నం ఇవ్వలేదనే కారణంతో కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇవ్వడం కలకలం రేపుతోంది. సహరాన్‌పూర్ జిల్లాలోని గంగోకు చెందిన మహిళ 2023లో ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తితో వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబం రూ.15 లక్షల కట్నంతో పాటు భారీ మొత్తంలో నగలు ఇచ్చారు. అయితే, కొంతకాలానికే అత్తింటి కుటుంబం అదనపు కట్నం కింద రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు.
అదనపు కట్నం కోసం అమానుష చర్య
ఇప్పటికే రూ.15 లక్షలు, కారు ఇచ్చినా, పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం ఒత్తిడి పెరిగింది. కోడలు నిరాకరించడంతో అత్తమామలు భిన్న మార్గాల్లో వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కోడలికి సోకిన సిరంజిని ఉపయోగించి హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు తేలింది.
ఇది కూడా చదవండి: Kumbh Mela Accident: కుంభమేళాలో మరో ప్రమాదం.. నలుగురి దుర్మరణం!
పోలీసుల దర్యాప్తు
బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అత్తగారు ఈ అమానుష చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది. బాధితురాలి భర్త, అత్తగారు, మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.