HIT 3: నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టితో కలిసి దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసేందుకు రెడీ అయింది. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో మూడో చిత్రమైన ఈ వైలె క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. యూఎస్ మార్కెట్‌లో నాని సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘హిట్ 3’ ఈ విషయంలో మరోసారి సంచలనం సృష్టించింది. యూఎస్-నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌లోనే 3 లక్షల డాలర్ల మార్క్‌ను అలవోకగా అందుకుని దూసుకెళ్తోంది.
ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. మిక్కీ జే మేయర్ సమకూర్చిన సంగీతం, నాని నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మే 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నాని యాక్షన్ రూపం, శైలేష్ దర్శకత్వ ప్రతిభతో ‘హిట్ 3’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.