ap news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా రాప్తాండు మండలంలోని పండమేరు వాగు ఉగ్రరూపం దాలుస్తున్నది. వరదనీరు ఉప్పెనలా అంతకంతకూ పెరుగుతున్నది. మంగళవారం పండమేరు పరిసర ప్రాంతాలు నీటమునిగాయి.
ap news: పండమేరు వరదనీటితో న్యూ అంబేద్కర్ కాలనీ నీట మునిగింది. వాగు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది. అంతకంతకూ వరదనీరు పెరుగుతుండటంతో వాగు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పలు వాగులు, వంకల్లో ఆకస్మిక వరద నీటి ప్రవాహాలతో జిల్లా అంతటా అతలాకుతలం అవుతున్నది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.