JYOTHI MALHOTRA: హర్యానాలో దేశ భద్రతను కుదిపేసే గూఢచారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా అనే యువతి, ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్‌కి వెళ్లి, భారత సైనిక సమాచారం అక్కడి ఇంటెలిజెన్స్‌కు పంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమెతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హిసార్ పోలీసుల ప్రకారం, జ్యోతి 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ను సందర్శించింది. అక్కడ ఆమె డానిష్ అలియాస్ ఎహ్సాన్-ఉర్-రహీం అనే ఐఎస్ఐ ఏజెంట్‌తో పరిచయం పెంచుకుంది. ఆ తరువాత ఆమె పాకిస్తాన్ వెళ్లినపుడు డానిష్ ద్వారా భద్రతా అధికారులతో కూడా కలిసింది. అక్కడ షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులతో మల్లీశ్వరంగా వ్యవహరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
తరువాత జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లలో ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్టు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి భద్రతా సమాచారాన్ని ఎలా లీక్ చేస్తున్నారనే అంశంపై ఆందోళనను పెంచుతోంది.