Harish Rao: రేవంత్ రెడ్డి సర్కార్‌పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి తమకి అప్పగించరు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో మొత్తం తెలంగాణ అప్పులు రూ. 7 లక్షల కోట్లని రేవంత్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేసింది.మా మీద బురద జల్లాలని చూసి వారే బురదలో పడ్డారు తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు అని దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది తప్పుడు ప్రచారమని RBI లెక్కలే చెప్తున్నాయి అని పేర్కొన్నారు
ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ నివేదికలోని గణాంకాలు చూసైనా.. కాంగ్రెస్ గోబెల్స్ విషప్రచారం చేయడాన్ని మానుకోవాలని హరీష్ రావు హెచ్చరించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికతో పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై, ఆర్థిక వృద్ధిపై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నది దుష్ప్రచారమేనని తేలిపోయింది అని అన్నారు. తెలంగాణ దివాలా తీసిందంటున్న వారికి ఆర్బీఐ రిపోర్టు చెంపపెట్టు లాంటిది అన్ని హరీష్ రావు తెలిపారు.
ఎలక్షన్ లో గెలవడానికి అడ్డగోలు హామీలిచ్చి. ఆరు గ్యారెంటీలు అమలుచేయడం చేతగాక, బాండ్ పేపర్లు రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, అధికారంలోకి వచ్చి.. నేడు ప్రజలను మోసం చేస్తున్నారు అని. తమ వైఫ్యల్యాలను కప్పిపుచ్చుకోవడానికి లేని అప్పులు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు అన్నారు.