Orange Juice: చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలా మంది నారింజ పండ్లను తినడానికి ఇష్టపడరు. ఆరెంజ్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ వస్తాయని ప్రజలు భయపడుతారు. అయితే చలికాలంలో వీటిని తీసుకుంటే చాలా రకాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
చలికాలంలో చలి కారణంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Orange Juice: నారింజ రసంలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని పీచు ఆకలిని అరికడుతుంది. అలాగే, ఇది మన శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరెంజ్ జ్యూస్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థ బలంగా ఉండటానికి, సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
Orange Juice: నారింజ రసంలో విటమిన్ సి ఇ పుష్కలంగా ఉంటాయి . దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపడుతుంది, ముఖంపై ముడతలు తగ్గుతాయి. అలాగే, గాయాల వల్ల ఏర్పడిన డార్క్ స్పాట్స్ , స్కార్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది.