Gujarat: గుజరాత్ రాష్ట్రంలో మరోచోట బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై నుంచి నడిచే వాహనాలు సైతం నదిలో పడిపోయాయి. ఆ వాహనాల్లో వెళ్తున్న వారిలో ఓ ముగ్గురిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన విషయం తెలిసిన అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
Gujarat: గుజరాత్‌లోని వడోదరా సమీపంలోని గంభీర బ్రిడ్జి బుధవారం (జూలై 9) కుప్పకూలింది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ బ్రిడ్జి కూలడంతో దానిపై వెళ్లే నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. వీటిలో రెండు లారీలు ఉండటం గమనార్హం. బ్రిడ్జి కూలిపోవడంతో వడోదర-ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Gujarat: వాహనాలలో ఉన్న ఓ ముగ్గురిని రక్షించి, బయటకు రప్పించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలిస్తున్నారు. ఇంకా ఎంత మంది ఉన్నారనేది తెలియరాలేదు. ఎవరైనా చనిపోయి ఉంటారా? అనే విషయం కూడా తెలియరాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.