తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన దేవదేవుని సేవకోసం ఏర్పాటు చేసిన సంస్థ. దానికి ఛైర్మన్ గా వ్యవహరించడం అంటే.. ధర్మాన్ని కాపాడటానికి నిస్వార్ధంగా.. నిజాయతీగా.. నిష్కలంకషంగా భక్తులకు సేవ చేయడంలోనే శ్రీవారి సేవ ఉండనే తపనతో ఉండల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు.. కొన్ని సంవత్సరాలుగా టీటీడీ అంటేనే ప్రజల్లో తేలిక భావం ఏర్పడిపోయేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణాలు ఏమైనా కానీ.. తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా.. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అప్పటి పెద్దలు వ్యవహరించారనేది నిర్వివాదాంశం. అందరికీ తెలిసిన సత్యం.
ఇలాంటి పరిస్థితిలో టీటీడీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు బీఆర్ నాయుడు.
రైతు కుటుంబంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్ చేరి.. వ్యాపారవేత్తగా మారి.. మీడియా ప్రతినిధిగా ఎదిగి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా శ్రీవారి భక్తులకు సేవ చేస్తుకుని అపూర్వ అవకాశం అందుకున్న బీఆర్ నాయుడు.. మహా న్యూస్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన జీవిత ప్రస్థానం.. శ్రీవారి భక్తునిగా తన అనుభవాలు.. రాజకీయంగా తన స్టాండ్.. టీటీడీ ఛైర్మన్ గా వేంకటేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించాలి.. ప్రశాంతంగా దేవదేవుని దర్శనం చేసుకుని భక్తులు ఆనందపరవశులు కావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనీ అనుకుంటున్నారు.. ఇలా తన మనసులోని భావాలను మహా న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మహా వంశీతో పంచుకున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.
మహావంశీతో సుదీర్ఘంగా ముచ్చటించిన బీఆర్ నాయుడు అనేక విషయాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో టీటీడీలో జరిగిన అవకతవకలు.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన విధానాలపై మీరెలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించిన మహా వంశీకి విస్పష్టంగా తాను ఏమి చేయాలని అనుకుంటున్నారో వివరించారు. గతం గతః అంటూనే అప్పట్లో పాపలు చేసిన వారి సంగతి దేవదేవుడు చూసుకుంటాడని చెప్పారు. ఆ వ్యవహారాలపై దృష్టి పెట్టి.. ఆ పాపాల్లో భాగం అయిన వారి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం కంటే.. ఇక్కడి నుంచి అలాంటి లోపాలు.. పాపాలు టీటీడీ నుంచి జరగకుండా చూడడమే తమ కర్తవ్యమ్ అని స్పష్టం చేశారు. ఒక్కో పరిస్థితిని చక్కదిద్దుతూ.. తిరుమల పవిత్రతను కాపాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అన్యమతస్తులను టీటీడీలో పనిచేయకుండా చూడడం దగ్గర నుంచి భక్తులకు తృప్తికరంగా దర్శన భాగ్యం కలిపించే అంశం వరకూ ప్రతి విషయంపైనా శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. తప్పు చేసిన వారి సంగతి శ్రీవారికి వదిలేద్దాం.. మనం చేయగలిగిన మంచిని చేద్దాం.. అంటూ బీఆర్ నాయుడు తన వైఖరిని స్పష్టం చేశారు.
మహా వంశీతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను పూర్తిగా ఈ క్రింది వీడియోలో చూడండి.