Telangana: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత కవులు, కళాకారులతో సమావేశం అవుతారు.
