Akhil Akkineni: టాలీవుడ్‌లో యువ హీరోల్లో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు. హీరోగా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక్కటి మినహా సరైన హిట్ లేకపోయినా, అఖిల్ నెక్స్ట్ సినిమా అంటే ఇండస్ట్రీలో సాలిడ్ బజ్, బిజినెస్ కనిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఈ రేంజ్‌లో అఖిల్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడని చెప్పొచ్చు. తాజాగా అతని లాస్ట్ ఫిల్మ్ ‘ఏజెంట్’ తర్వాత, 6వ సినిమాపై అభిమానుల్లో భారీ సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు సమాచారం. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న మేకర్స్ ఈ ట్రీట్‌ను ఫ్యాన్స్‌కు అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా కీలకం కానుంది. అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అప్‌డేట్ ఎలా ఉంటుందో చూడాలి.
