Gold rate: పసిడి ప్రియులు ధన త్రయోదశి పండుగను చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. నార్త్ ఇండియాలో ఈ పండుగను దంతేరస్ అంటారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని భావిస్తారు. అలాగే సంవత్సరం అంతా శుభం జరుగుతుంది అని కూడా భావిస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉంటారు
బంగారానికి భారీ డిమాండ్ పెరగడంతో ఆ డిమాండ్ కు తగ్గట్టు రేటు కూడా పెరుగుతుంది. సీజన్ కానప్పుడు బంగారం ధర పైపైకి వెళ్ళింది. అలాంటిది ఇంకా పెళ్లిళ్ల సీజన్ వస్తుంటే రేటు ఆకాశం అంటుంది. సగటున ఒక్క రోజుకు బంగారం ధర 50 రూపాయలు పెరుగుతూ వస్తుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది.
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,880గా ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.99,750 ఉండగా, సోమవారం నాటికి రూ.1,036 తగ్గి రూ.98,714కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర ఇలా ఉంది.24k 80,425గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తులం బంగారం ధర ఇలా ఉంది. 24k 80, 380గా ఉంది.
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా లో పరిశీలిస్తే..24k 80, 380గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24k 80, 380గా ఉంది.
ప్రస్తుతం బంగారం ధర 81 వేల రూపాయల సమీపంలో ఉంది. అయితే ఈ రేంజ్ నుంచి బంగారం ధర మరింత ముందుకు వెళుతుందా లేక పతనం అవుతుందా అనే సంగతి తెలియాల్సి ఉంది.