Disposable Paper Cups: టీ, కాఫీలు తాగడం వల్ల మనసుకు మంచి అనుభూతి కలుగుతుంది. అయితే పేపర్ కప్పులో వేడి వేడి టీ, కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. పేపర్ గ్లాస్ లో టీ, కాఫీ తాగడం వలన ఆరోగ్యానికి హానికరమని ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన పరీక్షలో తేలింది. పేపర్ కప్పుల్లో రోజుకు మూడు సార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున వేడి వేడి టీ తాగితే.. 75 వేల హానికర మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు.
ఈ విధంగా శరీరంలోకి చేరే ప్లాస్టిక్ క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కారణమవుతుందని అధ్యయనంలో తేలింది. ఫుడ్ డిపార్ట్ మెంట్ పేపర్ కప్పులను లేబొరేటరీలో పరీక్షించి వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. పేపర్ కప్పుల్లో 20 శాతం ప్లాస్టిక్ వాడుతున్నారు. దీనివల్ల వేడివేడి టీ, కాఫీలు వేస్తే ప్లాస్టిక్ కరిగిపోతుంది.
ఇది కూడా చదవండి: Bajaj Chetak E-Scooter: మార్కెట్‌లోకి రానున్న న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే
Disposable Paper Cups: కరిగిన ప్లాస్టిక్ పదార్థం మానవ శరీరంలోకి ప్రవేశిస్తే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ప్లాస్టిక్‌తో కలిపిన పేపర్‌కప్ ప్రమాదకరమని వీధి వ్యాపారులు కూడా నమ్ముతున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ కంటెంట్ ఉన్న పేపర్ కప్పుల వినియోగం 90 శాతం తగ్గింది. సాధారణంగా పేపర్ కప్పులు వాడుతూ వేడి వేడి టీ, కాఫీలు తాగడం ఇక నుంచి మానేయడం మంచిది.