Gold Price Today

Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తులం ఎంత అంటే?

Gold Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో బంగారం కొనాలంటే జనాలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం, బులియన్ (బంగారం, వెండి) ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా వీటి డిమాండ్ పెరగడంతో పాటు డాలర్ బలహీనపడటం.

పెట్టుబడిదారులు ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి విషయాలను గమనిస్తున్నారు. అందుకే, తమ సంపదను కాపాడుకోవడం కోసం సురక్షితమైన పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ఫలితంగా పసిడి, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు కాస్త తగ్గినా, మరుసటి రోజు అంతకు రెట్టింపు పెరగడం సర్వసాధారణంగా మారింది.

అక్టోబర్ 9న ధరలు ఇలా ఉన్నాయి:
తాజాగా, అక్టోబర్‌ 9వ తేదీన 10 గ్రాముల (తులం) బంగారం ధరపై రూ.220 పెరిగి రూ.1,24,150కి చేరుకుంది. ఈ ధర 24 క్యారెట్ల బంగారానికి సంబంధించినది.

వెండి ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కిలో వెండిపై ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.1,61,000లకు చేరింది.

హైదరాబాద్‌, చెన్నై, కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే వెండి ధర మరింత ఎక్కువగా, కిలో రూ.1,71,000 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (అక్టోబర్ 9):
సామాన్యులు ఎక్కువ కొనే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ప్రధాన నగరాల్లో ఈ విధంగా ఉంది:

* హైదరాబాద్: రూ.1,13,800

* ఢిల్లీ: రూ.1,13,950

* ముంబై: రూ.1,13,800

* చెన్నై: రూ.1,14,000

* బెంగళూరు: రూ.1,13,800

* కేరళ: రూ.1,13,800

బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే అయినప్పటికీ, ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం, పండగలు, శుభకార్యాల సీజన్ వస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల మహిళల కలలపై నీళ్లు చల్లుతోందని చెప్పొచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *