Yash Dayal: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ యశ్ దయాళ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి యశ్దయాళ్ పై లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో యశ్ దోషిగా తేలితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
యశ్ దయాళ్ తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని, ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అతను తనను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దోపిడీ చేశాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది . దయాల్ తనను తన కుటుంబానికి పరిచయం చేయడంతో తనని మరింత నమ్మినట్లు తెలిపింది. అయితే తమ పెళ్లి గురించి అడిగినపుడు తనపై వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది.
యశ్ దయాళ్ కు చాలా మంది మహిళలతో కూడా సంబంధాలు ఉన్నాయని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, అందులో చాట్లు, స్క్రీన్షాట్లు వీడియో కాల్ల రికార్డింగ్‌లు ఉన్నాయని చెబుతోంది. ఈ ఆధారాలు తన ఆరోపణలను పూర్తిగా నిరూపించగలవని బాధితురాలు చెబుతోంది. అతను తనను కొట్టాడని, మానసికంగా హింసించడం ప్రారంభించాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు న్యాయం కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా వేడుకుంది. ఈ విషయమై యశ్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు..
ఇది కూడా చదవండి:
Shubman Gill: ఒకే ఒక్కడు.. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్ గిల్ రికార్డుల మోత!
Vaibhav Suryavanshi: నెక్ట్స్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేస్తా.. వైభవ్ సూర్యవంశీ ప్రమాణం

