white hair

White Hair: ఈ ఆహార పదార్థాలు తింటే.. జుట్టు తెల్లబడటం ఖాయం

White Hair: జుట్టు తెల్లబడడం.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న కామన్‌ సమస్య. అయితే ఒకప్పుడు కేవలం వయసు మళ్లి వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా కనిపిస్తోంది. తెల్లజుట్టు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానమైనవి జీన్స్‌, జీవనశైలి, వాయు కాలుష్యం అని అందరికీ తెలిసిందే. అయితే తీసుకునే ఆహారం కూడా తెల్ల వెంట్రుకలకు దారి తీస్తుందని మీకు తెలుసా.? ఇంతకీ జుట్టు తెల్లబడడానికి తీసుకునే ఆహారానికి మధ్య సంబంధం ఏంటి.? ఎలాంటి ఫుడ్‌ వల్ల జుట్టు తెల్ల బడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1) ఆల్కహాల్ తాగే వారి లివర్‌ పాడవుతుందని తెలిసిందే. అయితే కేవలం లివర్‌ మాత్రమే కాకుండా. జుట్టు ఆరోగ్యంపై కూడా ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం ఆల్కహాల్‌ తీసుకునే వారిలో త్వరగా జుట్టు తెల్లబడే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

2) ఇక ప్యాక్‌ చేసిన ఆహారాలను తీసుకునే వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ప్యాకేజీడ్‌ ఫుడ్‌ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉద్దేశంతో ఎక్కువ ఉప్పును ఉపయోగిస్తుంటారు. ఇది రక్తపోటు వంటి సమస్యలతో పాటు తెల్ల జుట్టుకు కూడా కారణమవుతుందని అర్థం. చిన్నారుల్లో కూడా తెల్ల జుట్టు రావడానికి ఇదొక ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.

3) ఇక టీ, కాఫీలను ఎక్కువగా తీసుకునే వారిలో కూడా తెల్ల జుట్టు సమస్య వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మోతాదుకు మించి టీ, కాఫీలు తీసుకునే వారిలో జుట్టు తెల్లబడుతుందుని అంటున్నారు. కాఫీలో ఉండే కెఫిన్‌ కంటెంట్‌.. శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. దీంతో జుట్టు తెలుపు రంగులోకి మారుతుందని నిపుణులు అంటున్నారు.

4) వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నాఉ. వేయించిన ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. దీంతో జుట్టు తెల్లగా మారుతుంది.

5) అలాగే ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పులతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నిరాకరణ: వ్యాసంలో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

ALSO READ  Black Tea Vs Black Coffee: బ్లాక్ టీ - బ్లాక్ కాఫీ.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *