Environment: ప్లాస్టిక్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్నదని తెలిసినా ప్రజలు దాని వాడకాన్ని తగ్గించలేకపోతున్నారు. ఒక్క ప్రజలకే కాదు జీవావరణానికే ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. జంతుజాలాలు, పశుపక్ష్యాదులకు ప్లాస్టిక్ భూతం పొంచి ఉన్నదని చెప్తున్నారు. ఈ దశలో భవిష్యత్తు ఈ ప్లాస్టిక్‌తో అంధకారం అయ్యే ప్రమాదం ఉన్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
Environment: ప్రపంచవ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలనే రీసైక్లింగ్ చేస్తున్నారని తేలింది. ఏటా దాదాపు 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుకుంటున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక ప్లాస్టిక్ సంచి సగటున 12 నిమిషాలు ఉపయోగించబడుతుందని చెప్పారు. కానీ, కుళ్లిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని హెచ్చరించారు.
Environment: ప్లాస్టిక్ సముద్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర జీవులకు ప్లాస్టిక్ వ్యర్థాలు హాని కలిగిస్తున్నాయని చెప్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో చిక్కుకొని తాబేళ్లు, సీల్స్, పక్షులు, జంతువులు గాయాలపాలవుతున్నాయని, కొన్ని మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికీ అనేక దేశాలు ప్లాస్టిక్ సంచులు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధించాయని, అయినా కొన్ని దేశాల్లో విరివిగా వాడకం పెరుగుతూ వస్తున్నదని చెప్పారు.
Environment: ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 మిలియన్ ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు అవుతున్నాయని పర్యావరణ వేత్తలు తెలిపారు. 2050 నాటికి సముద్రంలో ప్లాస్టిక్ బరువు అన్ని చేపల బరువును మించి పోతాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఎంతో దూరం లేదని, దగ్గరలోనే ఉన్న విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. బాధ్యత గల పౌరులు ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను తిరస్కరించాలని హితవు పలికారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని కోరారు.