Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రమేపీ ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఏదైనా వెహికిల్ కొనాలి అనుకున్నపుడు ఎలెక్ట్రిక్ వెహికిల్ కోసం చూస్తున్నారు. ముఖ్యంగా టూ వీలర్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ బాగా పెరిగింది. మారుతున్న ట్రెండ్ కు సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రుజువుగా ఉన్నాయి.
సెప్టెంబరులో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 25% పెరిగాయి. మొత్తం EV రిజిస్ట్రేషన్లు (అన్ని విభాగాలతో కలిపి) 1.49 లక్షలుగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబరులో 1.19 లక్షల ఈవీలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 1.47 లక్షలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్-సెప్టెంబర్) 19% వృద్ధి నమోదైంది. ఈ కాలంలో మొత్తం 8.37 లక్షల ఈవీలు నమోదయ్యాయి.
Also Read: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి
Electric Vehicles: గతేడాది ఇదే కాలంలో 7.02 లక్షల వాహనాలు నమోదయ్యాయి. వాహన పోర్టల్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల (కార్లు – SUVలు) అమ్మకాలు 43,120 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో 42,550 ఈ-ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 8.6% పెరిగి 22,749 యూనిట్లకు చేరుకున్నాయి. రెండవ త్రైమాసికంలో అమ్మకాలు 6% క్షీణించి 20,141 యూనిట్లకు చేరుకున్నాయి.
Electric Vehicles : సెప్టెంబర్‌లో టూవీలర్ అమ్మకాలు 40% పెరిగాయి
- సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 88 వేల యూనిట్లుగా ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 2023లో 63 వేల యూనిట్లు, ఆగస్టు 2024లో 87 వేల యూనిట్లు. అంటే వార్షిక ప్రాతిపదికన 40% పెరిగింది.
- సెప్టెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు 23,965 యూనిట్లుగా ఉన్నాయి. ఆగస్టు 2014లో 26,928 యూనిట్లు ఉన్నాయి. బజాజ్ 18,933 యూనిట్లను విక్రయించింది, ఇది ఆగస్టులో 16,650 నుండి బజాజ్ రెండవ స్థానంలో నిలిచింది.
- సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్ 54 వేల యూనిట్లు. 2023 సెప్టెంబర్‌లో 49 వేల యూనిట్లు, ఆగస్టు 2024లో 52 వేల యూనిట్లు. అంటే వార్షిక ప్రాతిపదికన 10% పెరుగుదల.