Pune Helicopter Crash

Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి

Pune Helicopter Crash మహారాష్ట్రలోని పూణేలోని బావధాన్ సమీపంలో బుధవారం ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో 3 మంది చనిపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. బవ్‌ధాన్ ప్రాంతంలోని కెకె రావు కొండ ప్రాంతంలో ఉదయం 6:30 – 7 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కొండ చుట్టూ పొగమంచు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు .  

ప్రమాదం తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ముగ్గురి మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. హెలికాప్టర్ ప్రభుత్వానిదా  లేక ప్రైవేట్‌దా అనేది ఇంకా తెలియరాలేదు. మృతులను కూడా గుర్తించలేకపోయారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth Reddy: పంట రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *