Free Bus

Free Bus: ఫ్రీ బస్సు తెచ్చిన తిప్పలు.. డ్రైవర్ చెంప పగలగొట్టిన మహిళ..!

Free Bus: దేశంలో పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ వలన బస్సులు తరచూ కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికుల మధ్య తగాదాలు, డ్రైవర్లు–కండక్టర్లతో  మహిళల వాగ్వాదాలు జరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులో అలాంటి ఘటన ఒకటి సంచలనంగా మారింది.

బెంగళూరులోని తుమకూరు రోడ్డులోని పీన్యా సమీపంలో బిఎమ్‌టిసి బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలు, డ్రైవర్ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. సమాచారం ప్రకారం, తనకోరిన చోట బస్సు ఆపలేదని మహిళా ప్రయాణికురాలు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు మొదలై, కొద్ది సేపటికే ఇద్దరూ ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకునే వరకు వెళ్లింది.

ఇది కూడా చదవండి: Nepal Prisoners Escape: నేపాల్‌లో అల్ల‌క‌ల్లోలం.. 7 వేల మంది ఖైదీల ప‌రార్‌!

ఈ ఘర్షణను ఒక వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో కాసేపట్లోనే వైరల్ అయ్యింది. వీడియోలో మహిళా ప్రయాణికురాలికి తోటి ప్రయాణికుల మద్దతు లభించినట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కండక్టర్ మధ్యవర్తిత్వం చేసి ఇరువురిని శాంతింపజేశాడు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్–ప్రయాణికురాలి గొడవకు నిజమైన కారణం ఏమిటో బయటకు రానుంది. అయితే, ఇలాంటి ఘటనలు ప్రజా రవాణాలో తరచూ జరుగుతున్నాయి. ఇది వరకు ఇలా ఉందేది కాదు. ఎప్పుడైతే ఫ్రీ బస్సు సర్వీస్ వచ్చిందో అప్పటినుండి సోషల్ మీడియాలో ఇలాంటి గొడవలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఇంకా బయటికిరానివి చాలానే ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టడం తప్ప. దాని అదనుగా చేసుకొని గొడవలకి దిగే వలదీ తప్ప.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NEET PG Results 2025: వైద్య విద్యార్థులకు శుభవార్త! విడుదలైన NEET PG 2025 ఫలితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *