Delhi politics:

Delhi politics: ఢిల్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌.. కేజ్రీవాల్‌పై పోటీ చేసేది ఆయ‌నే?

Delhi politics: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ తొలి జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో 29 స్థానాల‌కు త‌న అభ్య‌ర్థులను ఖ‌రారు చేసింది. ఇటీవ‌లే బీజేపీలో చేరిన ఆప్ నేత‌లైన రాజ్‌కుమార్ ఆనంద్‌, కైలాష్ గెహ్లాట్‌కు ఈ తొలి జాబితాలో చోటు క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. ఆప్ స‌ర్కారులో మంత్రులుగా ఆనంద్‌, కైలాష్ గెహ్లాట్ ప‌నిచేశారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన స‌ర్దార్ అర్వింద‌ర్‌సింగ్‌కు కూడా తొలి జాబితాలోనే చోటు క‌ల్పించారు.

Delhi politics: ఆప్ మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ ప‌ర్వేష్ సింగ్ వ‌ర్మ‌ను బీజేపీ రంగంలోకి దింప‌నున్న‌ది. దీంతో ఆయ‌న‌ను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దింపింది. ఈ మేర‌కు తొలి జాబితాలోనే ఆయ‌న పేరును ఖ‌రారు చేసింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సందీప్ దీక్షిత్‌ను బ‌రిలోకి దింప‌నున్న‌ది. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, ఆప్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న అతీశీపై బీజేపీ ర‌మేశ్ బిదూరిని రంగంలోకి దిపింది.

Delhi politics: మ‌రోవైపు దుశ్యంత్ గౌత‌మ్ క‌రోల్ బాగ్ నుంచి మంజింద‌ర్‌సింగ్ స‌ర్సా రాజౌరీ గార్డెన్ నుంచి కైలాష్ గెహ్లాట్ బిజ్వాస‌న్ నుంచి పోటీ చేయ‌నున్నారు. గాంధీన‌గ‌ర్ నుంచి అర‌వింద‌ర్‌సింగ్ ల‌వ్లీ స‌హా ప‌లువురికి బీజేపీ టికెట్ల‌ను ఖ‌రారు చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌క‌పోయినా, ఢిల్లీలో రాజ‌కీయ వేడి మాత్రం పుంజుకున్న‌ది. ఈ ద‌శ‌లోనే బీజేపీ తొలిజాబితా విడుద‌ల చేయ‌డంతో అంతా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *