Bellamkonda Sai Sreenivas: పులి వేట ఎప్పుడూ హడావుడిగా ఉండదు. మాటువేసి వేచి చూసి రంగంలోకి దిగుతుంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అలానే ఓపికగా ఉన్నాడు. ఓ గ్రాండ్ సక్సెస్ ను అందుకోవడం కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తున్నాడు. జనవరి 3 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా అతని ప్రెజెంట్ మూవీస్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ విడుదలయ్యాయి. బెల్లంకొండ నటిస్తున్న ‘టైసన్ నాయుడు, భైరవం’ చిత్రాలతో పాటు అతని 11, 12వ చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. ‘బైరవం’ మూవీ టీమ్ ఓ లిరికల్ వీడియోను సైతం విడుదల చేసింది.