Daaku Maharaaj: సంక్రాంతి కానుకగా రాబోతున్న నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుండి వచ్చిన స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను దబిడి దిబిడి చేసేస్తోంది. బాలకృష్ణ ఊరమాస్ స్టెప్స్, ఊర్వశీ రౌతేలా డాన్స్ మూమెంట్స్ కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను మూడు చోట్ల చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్లాన్ చేశారు. ఇందులో మొదటి ఈ నెల 5న డల్లాస్ లో జరుగబోతోంది. ఇందులో పాల్గొనడానికి నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అమెరికా బయటుదేరి వెళ్ళారు. అక్కడ నుండి తిరిగి రాగానే మొదట హైదరాబాద్ లో 7న గ్రాండ్ ఈవెంట్ ను జరుపబోతున్నారు. ఆ తర్వాత 9న అనంతపూర్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయబోతున్నారు. ‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్న బాలకృష్ణ ఖాతాలో ‘డాకు మహారాజ్’తో మరో సక్సెస్ ఫుల్ మూవీ పడుతుందని అంటున్నారు.