Delhi: ఇప్పటి వరకు రవాణా రంగంలో మహిళలు అసలు ఉండరనే చెప్పవచ్చు. ఎక్కడో ఒక చోట మహిళా డ్రైవర్లు ఉన్నా, వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. అయినా వారిని చూసైనా మిగతా మహిళలు ఈ రంగంలోకి వస్తున్నారా? అంటే అదీ లేదు. మిగతా పలు రంగాల్లో పోటీనిస్తున్నా.. ఈ రంగంలో మాత్రం వారి ప్రాతినిథ్యం లేదు. అయితే మహిళలు అన్నిరంగాల్లో సగభాగం అన్న సూక్తిని అమలు చేయాలనే సంకల్పంతో ఢిల్లీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఓ బస్ డిపోనే ప్రారంభించింది.
Delhi: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రారంభమైన ఈ మహిళా బస్ డిపో దేశంలోకెళ్ల మొట్టమొదటిదన్న మాట. ఢిల్లీలోని సరోజినీనగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోను ఆ రాష్ట్ర మంత్రి కైలాశ్ గహ్లెత్ ప్రారంభించారు. ఈ డిపోనకు సఖి డిపో అని మహిళా నామకరణం వచ్చేలా పేరు కూడా పెట్టారు. ఈ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర మెకానిక్ సిబ్బంది అందరూ మహిళలే అన్నమాట. ఇందుకోసం ఇప్పటికే మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది.
Delhi: ఈ సంకల్పం దేశంలోని అన్నిరాష్ట్రాలకు ఎగబాకితే రవాణా రంగంలో మహిళా ప్రాతినిథ్యం పెరుగుతుందన్న మాట. ఈ మహిళా ప్రత్యేక డిపోతో మార్పు మొదలు కావాలని కోరుకుందాం.

