Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సౌత్ సినిమాల్లో హవా కొనసాగిస్తోంది. అయితే, ఆమె భారీ రెమ్యూనరేషన్, డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. కల్కి 2, స్పిరిట్ లాంటి ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకుంది. కానీ అల్లు అర్జున్-అట్లీ భారీ చిత్రంలో ఆమె ఎలా కుదిరింది? ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత? ఆమె రెమ్యూనరేషన్ ఎంత? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: OG Ticket Auction: పవన్ ఫ్యాన్స్ భక్తి పీక్‌లో: ఒక్క టికెట్‌కి లక్ష, పార్టీకి నిధులు!
దీపికా పదుకొణె టాలీవుడ్లో తన గుర్తింపు పెంచుకుంటోంది. కానీ ఆమె రూ.30 కోట్ల రెమ్యూనరేషన్, తక్కువ పని గంటలు, టీమ్ మెయింటెనెన్స్, ప్రాఫిట్ షేర్ డిమాండ్లు వివాదాస్పదమయ్యాయి. కల్కి 2, స్పిరిట్ లాంటి భారీ చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడానికి ఈ డిమాండ్లే కారణమని టాక్. కానీ అల్లు అర్జున్-అట్లీ కాంబో సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్, అట్లీ జవాన్ తర్వాత భారీ డీల్, హాలీవుడ్ టెక్నీషియన్లతో ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 800 కోట్లతో ఆకాశాన్ని తాకుతోంది. కొత్త థీమ్‌లు, భారీ సీజీ వర్క్‌లతో ఈ సినిమా ఖర్చు భారీగా ఉంది. ఇలాంటి స్థితిలో దీపికా చాలా అవసరం కావడంతో ఆమె అడిగిన భారీ రెమ్యూనరేషన్ నే ఆఫర్ చేసిందట సన్ పిక్చర్స్ సంస్థ. ఆమెకు దాదాపు 30 కోట్లు ప్లస్ ఇతర సౌకర్యాలని కూడా అందించినట్లు టాక్ నడుస్తుంది.