Daaku Maharaaj first day collection: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’కు బాక్సాఫీస్ బరిలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మాత్రమే విడుదలై ఈ సినిమా తొలి రోజున రూ. 56 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. రెండేళ్ళ క్రితం సంక్రాంతికే వచ్చిన బాలకృష్ణ సినిమా ‘వీర సింహారెడ్డి’ మొదటి రోజున రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ‘డాకు మహారాజ్’ మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం రాత్రి టీమ్ సభ్యులంతా గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన ఊర్వశీ రౌతేలాతో కలిసి బాలకృష్ణ సరదాగా డాన్స్ చేశారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Balakrishna steps with Urvashi Rautela at Daku Maharaj’s success party.#Balakrishna #UrvashiRautela pic.twitter.com/voNReUoYkJ
— Amoxicillin (@__Amoxicillin_) January 13, 2025