Crime News: యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. మందలించేందుకని తండ్రి కొట్టిన దెబ్బలకు అకస్మాత్తుగా బాలుడు చనిపోయిన ఘటన చోటుచేసుకున్నది. అయితే రాత్రి ఈ ఘటన జరగగా, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా, పోలీసులు ఎంటర్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిందేనని పట్టబట్టగా, వద్దని కుటుంబసభ్యులు, బంధువులు వారించడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
Crime News: చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో కట్టా సైదులు దంపతులకు ముగ్గురు సంతానం, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నారు. వారిని మంచిగా చదివించి పెద్ద చేయాలని కలలు కనేవారు. తమ స్థాయికి మించి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. కొద్దికాలంగా సైదులు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను వేధించసాగాడు.
Crime News: సైదులు చిన్నకొడుకు భాను (14) చౌటుప్పల్ పట్టణంలోని అన్నా మెమోరియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం (ఫిబ్రవరి 8) రాత్రి ఆ స్కూల్‌లో జరిగిన ఫేర్‌వెల్ పార్టీకి భాను వెళ్లాడు. ఆ పార్టీ ముగియగానే భాను రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న భాను తండ్రి సైదులు ఆగ్రహంతో కొడుకు భానును చితకబాదాడు.
Crime News: భాను ఛాతిపై తండ్రి సైదులు బలంగా దెబ్బలు కొట్టడంతో ఆ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎవరికీ చెప్పవద్దని సైదులు.. తన భార్య, కుటుంబ సభ్యులను బెదిరించాడు.
Crime News: తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా భాను మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు కొంత వాగ్వాదం చోటుచేసుకున్నది.
Crime News: చివరికి మద్యం మత్తులో కొడుకును చితకబాదిన తండ్రే అతని చావుకు కారకుడయ్యాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కన్నకొడుకును కొట్టి కడతేర్చిన తండ్రి దాష్టీకంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.