Crime News: హైదరాబాద్ నగరంలో వరుస దారుణాలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. హత్యలు, దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవలే ఓ ఇంటిలో, జువెల్లరీ దుకాణంలో భారీ చోరీ చోటుచేసుకున్న ఘటనను మరువక ముందే ఓ ఇంటిలో మహళను దారుణంగా హత్య చేసి, నగలు, నగదుతో దుండగులు పరారైనట్టు సమాచారం.
Crime News: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో నివసించే రేణు అగర్వాల్ (50) దారుణ హత్యకు గురయ్యారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. ప్రెజర్ కుక్కర్‌తో తలపై బాది, కత్తులతో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే ఇద్దరు బీహార్ యువకులే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Crime News: దుండగులు అదే అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో మోయలేకుండా ఉన్న ఓ బ్యాగ్‌తో వెళ్తుండగా సీసీ కెమెరాల్లో స్పష్టం రికార్డయి ఉన్నది. వారు మాటలు కూడా రికార్డయి ఉన్నాయి. వారే దుండగులు అయి ఉంటారని భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలను తేలుస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీంతో నగరంలో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ వైపు నుంచి ఇలాంటి దారుణాలు ముంచుకొస్తాయోనని జంకుతున్నారు.