Do Patti: ‘దో పత్తి’ సినిమాతో హీరోయిన్ కృతీసనన్ నిర్మాతగానూ మారింది. ఈ మూవీ శుక్రవారం నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ పాకిస్తానీ సింగర్ రేష్మ పాడిన ‘ఆంఖియా…’ అనే పాటను రీమిక్స్ చేశారు. అయితే ఈ రీమిక్స్ పాట అనుకున్న స్థాయిలో లేదంటూ పాకిస్తానీ సింగర్ అద్నామ్ సిద్ధిఖీ విమర్శించాడు. ‘ఎవరైనా ఏదైనా పాటను రీమిక్స్ చేస్తే… ఒరిజినల్ కంటే బాగుండేలా చేయాలని, చెడగొట్టేలా చేయకూడద’ని వ్యాఖ్యానించాడు. హిందీలో ఈ పాటను శిల్పారావు పాడగా, కౌసర్ మునీర్ రాశారు. తనిష్క్ బగ్చి సంగీతం అందించారు. అయితే… కొందరు అద్నామ్ సిద్ధిఖీ వ్యాఖ్యలను ఖండించారు. పాకిస్తానీ గాయని రేష్మ పాడిన పాట కంటే రీమిక్స్ సాంగే బెటర్ గా ఉందని అన్నారు. అంతగా తమ పాటలు రీమిక్స్ చేయడం ఇష్టం లేకపోతే… ఇండియన్ మ్యూజిక్ కంపెనీలకు రైట్స్ ఇవ్వొద్దని, తమ పాటలను తమ దగ్గరే ఉంచుకోవడం బెటర్ అని మరికొందరు సలహా ఇచ్చారు. ఏదేమైనా ‘దో పత్తి’లోని ఈ తాజా గీతం సరికొత్త వివాదాలకు నెలవై… మూవీ ప్రచారానికి బాగానే ఉపయోగపడుతోంది.
