Winter Tips: చలికాలంలో వేడి వేడి ఫుడ్ తినేందుకు జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక చలికాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అయితే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. చలికాలంలో బాడీని వేడిగా ఉంచే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
బెల్లం: ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచడం ద్వారా శరీరానికి చలితో పోరాడటానికి అవసరమైన వేడి అందుతుంది. దీనిని డైరెక్ట్ గా తినవచ్చు లేదా టీ, స్వీట్లతో కలిపి తినవచ్చు.
నెయ్యి: ప్రతీ ఇంట్లో నెయ్యి తప్పకుండా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వు. రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఏదైనా ఆహారం లేదా రొట్టెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తింటే జీర్ణక్రియ మరింత మెరుగవుతుంది.
చిరు ధాన్యాలు: గ్లూటెన్ రహిత ధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తృణధాన్యాలు ఐరన్, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. చపాతీ, రాగి జావా చలికాలంలో మంచి ఆహారంగా పనిచేస్తుంది.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి నట్స్‌లో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి.
నువ్వులు: చలికాలంలో నువ్వులు తింటే బాడీ హీట్ పెరుగుతుంది. హల్వా, చిక్కీ వంటి వివిధ రకాల స్నాక్స్‌లను తయారు చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఈ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం, నువ్వులతో లడ్డూలు చేసుకోవచ్చు.
పసుపు: పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు పొడిని గోరువెచ్చని పాలు, కూరలతో కలిపి తీసుకుంటే చలికాలంలో ఆరోగ్యంగా ఉంటారు.
తేనె: జలుబు, దగ్గు, ఫ్లూతో పోరాడడంలో తేనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన సహజ స్వీటెనర్. చలికాలంలో శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని హనీ అందిస్తుంది. చలికాలంలో దగ్గు, జలుబుతో పోరాడడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
సుగంధ ద్రవ్యాలు: అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు రక్త ప్రసరణను ప్రేరేపించి శరీరంలో వేడి పెంచుతుంది. వీటిని టీ లేదా కూరల్లో వేసుకుని తినాలి.
పీచు కూరగాయలు: చిలగడదుంపలు, క్యారెట్‌లలో బీటా-కెరోటిన్ సహా ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.