Hyderabad: హైదరాబాద్‌లోని మాదన్నపేటలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చే దారి లేక కుటుంబాన్ని నడిరోడ్డుపై వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూర్యపేటకు చెందిన ఏ. వెంకటేశ్వర్లు మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అంబర్‌పేట్ దుర్గానగర్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. నష్టాలే చవిచూశాడు. ఇలా వేలలు, లక్షల్లో కాదు కోటి రూపాయలు అప్పులు పాలయ్యాడు.
వస్తున్న జీతానికి తాను చేసిన అప్పులకు ఎలాంటి పొంతన లేకుండా పోయింది. కనిపించిన చోటల్లా అప్పులు తీసుకుంటూ వెళ్లాడు. చివరకు అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. వాటిని ఎలా తీర్చాలో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చున్నీతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.