Health Tips: ప్రతి ఒక్కరు తన బిడ్డ అందంగా పుట్టాలని కోరుకుంటారు. ముఖ్యంగా డార్క్ కాంప్లెక్షన్స్ ఉన్న జంటలు, బేబీ కలర్ తమ కలర్ కు మ్యాచ్ కాకూడదని, పాప రంగు తెల్లగా ఉండాలని అనుకుంటారు. అందుకే చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో బిడ్డను తెల్లగా మార్చే ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బిడ్డ తెల్లగా పుడుతుందని కొంతమంది నమ్ముతుంటారు. ఇది నిజమా..? అబద్ధమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పుట్టబోయే బిడ్డ రంగు తెల్లగా మారడానికి కొబ్బరి నీరు తాగాలని కొంతమంది సలహా ఇస్తుంటారు. గర్భం దాల్చిన మొదటి మూడు, నాలుగు నెలల్లో మంచినీళ్లు ఎక్కువ తాగాలని.. దాని వల్ల బిడ్డ ఆరోగ్యంగా, తెల్లగా పుడుతుందని కొందరు చెప్తుంటారు. అయితే మంచినీళ్లు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పడుతుందన్న వాదనను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అందులో ఎటువంటి నిజం లేదని చెప్పారు. ఎందుకంటే పిల్లల చర్మం రంగు తల్లిదండ్రుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది. పోషకాలు..పిండం రంగును ప్రభావితం చేస్తాయని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Solo Travel: సోలో ట్రిప్ వల్ల ఎన్నో లాభాలు.. తెలుసుకుంటే మీరూ వెళ్తారు..
Health Tips: శిశువు ఆరోగ్యంగా ఉండడానికి హెల్తీ ఫుడ్ చాలా ముఖ్యం. కానీ శిశువు రంగుతో ఏ ఆహారానికీ సంబంధం లేదు. లేత కొబ్బరి నీళ్లలో కాల్షియం, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే గర్భధారణ సమయంలో ఇది వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం, చక్కెర పరిమాణం షుగర్, బీపీ ఉన్న మహిళలకు సమస్యలను తెచ్చిపెడుతుంది.
గర్భధారణ సమయంలో మంచినీరు ఎంతో మేలు చేస్తుంది. కానీ పిండం యొక్క రంగుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాంటి వాదనల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.