Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీలక కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఆ కీలక కమిటీలలో సీఎం సహా రాష్ట్రస్థాయి ముఖ్య నేతలకు స్థానం దక్కింది. అయితే కొందరు మంత్రులకు స్థానం కల్పించకపోవడంతో వారికి టీపీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఆ కార్యవర్గాన్ని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. లేదంటే మంత్రి వర్గ విస్తరణ అనంతరమే టీపీసీసీ కార్యవర్గాన్ని విస్తరించవచ్చని భావిస్తున్నారు.
Congress Party: తెలంగాణ అడ్వయిజరీ కమిటీలో 15 మంది సభ్యులుగా ఏఐసీసీ నియమించింది. ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, వీ హనుమంతరావు, కే జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కీగౌడ్, జీ చిన్నారెడ్డి, జే గీతారెడ్డి, ఎం అంజన్‌కుమార్ యాదవ్, టీ జయప్రకాశ్‌రెడ్డి, జాఫర్ జావీద్, టీ జీవన్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, ఎస్ రాములు నాయక్‌ను నియమించారు.
Congress Party: కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా మల్లు రవిని, డీలిమిటేషన్ కమిటీ చైర్మన్‌గా చల్లా వంశీచంద్‌రెడ్డిని నియమించారు. డీలిమిటేషన్ కమిటీ సభ్యులుగా గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పవన్ మల్లాది, డీ వెంకటరమణను నియమించారు. 16 మందితో సంవిధాన్ బజావో ప్రోగ్రామ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా పి వినయ్‌కుమార్‌ను నియమించారు. సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూనాయక్, నర్సారెడ్డిని నియమించారు.
Congress Party: పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా 22 మందిని ఏఐసీసీ నియమించింది. వారిలో మీనాక్షి నటరాజన్, బీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ సీ రాజనర్సింహా, చల్లా వంశీచంద్‌రెడ్డి, జీ రేణుకా చౌదరి, పొరిక బలరామ్‌నాయక్, డీ శ్రీధర్‌బావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డీ అనసూయ సీతక్క, మహ్మద్ అలీ షబ్బీర్, మహ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, వీ శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, పీ సుదర్శన్‌రెడ్డి, కే ప్రేంసాగర్‌రావు, జెట్టి కుసుమకుమార్, ఈ అనిల్‌కుమార్‌లను సభ్యులుగా నియమించారు.